Subscribe

Advertisement

image-add

తెలుసుకొనవె చెల్లీ…||పద్మా శ్రీరామ్||

December 16th, 2014 by
padmasreeram poem

పాత చింతకాయ పచ్చడంటూ
చీరలు వలదన్నావు
చుడీదారు బాగన్నావు.

పోనీలే కంఫర్టేమో అనుకొన్నాను.

ఉక్కబోతన్నావు స్లీవులు వద్దన్నావు
తెలివొస్తుంది మున్ముందని ఊరుకున్నాను.

పెద్ద బట్టలేలని మిడ్డీల మోజుగన్నావు
మోకాళ్ళు పగిలితే తెలుస్తుందనుకొన్నాను

బోయ్ ఫ్రెండ్సన్నావు బాల్ డ్యాన్సన్నావ్
సినిమాలన్నావు షికారులన్నావు
రాతిరేళ రచ్చెందుకనుకున్నాను

పబ్బులన్నావు క్లబ్బులన్నావు
కాటుకెందుకన్నావు గాజులేలన్నావు
ఆటపాటల వయసున హద్దులేలన్నావు
అన్నింటికీ చిన్నతనంలే అనుకొని మిన్నకున్నాను

కాని………….ఇప్పుడు…….ఇప్పుడు పెళ్ళయ్యింది కదా!!!

బొట్టు బోరంటున్నావు తాళి బరువంటున్నావు
ఇది సమంజసమా తల్లీ??

నీ కంటి కాటుక అందం తో నుదుటి బొట్టు సోయగం
పోటీ పడును కదమ్మా

గాజుల రవళి రేగ సూత్రాలు అలికిడి సోక
ఎద సవ్వడి సైతం ఝల్లుమని మూగబోదా

ఇన్ని అందాలు వలదంటారు బ్యూటీ పార్లర్లంటారు
ఎప్పుడెరిగెదరు మీరు సంప్రదాయాల సౌందర్యం
ఎప్పుడగునో మీలాంటి యువతులకు సముచిత జ్ఞానోదయం

***ఈ రోజుల్లో కొందరి వేషధారణ చూసి , వారిపై కొందరు మగవాళ్ళు చేస్తున్న కామెంట్స్ విని భరించలేక నాలో కలిగిన వ్యధాభరిత భావోద్వేగం మాత్రమే. అన్యధా భావించవలదు.

||పద్మా శ్రీరామ్|| 29 Nov 2014

Share Button

Related Topics: , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]