Subscribe

Advertisement

image-add

రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మె!

April 30th, 2015 by
strike of road safety bill

కేంద్రం రూపొందించిన రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. కేంద్రం ప్రవేశపెట్టబోతున్న రోడ్డు రవాణా భద్రతా బిల్లును అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

సజావుగా ఉన్న రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బిల్లును మార్చి ఆమోదానికి పెట్టడంపై లారీ ఓనర్లు, డ్రైవర్లు, వాహనదారులందరూ మండిపడుతున్నారు. బిల్లును వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్‌ యూనియన్లు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో..అర్థరాత్రి నుంచే ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కార్మికులు ఇచ్చిన బంద్‌ పిలుపుకు లారీలు, ఆటోలు, ఇతర రవాణావాహనాల యజమానులు మద్దతు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు యాధావిధిగా తిరుగుతాయని యాజమాన్యం ప్రకటించడంతో..ఆర్టీసి బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి.

Share Button

Related Topics: , , , ,

This post currently has one comment.

plz increase font size

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]