Subscribe

Advertisement

image-add

కోలుకుంటున్న నేపాల్!

April 30th, 2015 by
telugu people from nepal

పెను భూకంపం మిగిల్చిన విషాదం తర్వాత నేపాల్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు క్రమంగా షాక్‌ నుంచి తేరుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచే ఖాట్మండ్‌లో కొన్ని చోట్ల దుకాణాలు తెరిచారు. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయి. విద్యుత్‌ను పునరుద్ధరించారు. టెలిఫోన్లు పనిచేస్తున్నాయి. అయితే కనీస అవసరాలైన నీళ్లు, పాలు, ఆహారం మార్కెట్లలో దొరకడం లేదు.

ఈ నెల 25న భారీ భూకంపం తర్వాత దాదాపు 600 అతి తక్కువ తీవ్రత గల వరుస ప్రకంపనలు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి ఈ ప్రకంపనలు నిలిచిపోయాయి. అయినప్పటికీ మళ్లీ భూకంపం వస్తుందనే భయం నేపాలీలను వెంటాడుతోంది.

భయాందోళనతో చాలా మంది ఖాట్మండ్‌, లోయ ప్రాతాలను వదలి వెళ్తున్నారు. లోయ ప్రాంతాల ప్రజలను బయటకు పంపించడానికి ఇతర సంస్థలతో కలిసి ప్రభుత్వం 600 బస్సులను ఏర్పాటు చేసింది.

Share Button

Related Topics: , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]