Subscribe

Advertisement

image-add

బచ్చలి కచోరి తయారీ విధానం!

February 4th, 2015 by
spinach kachori

కావల్సిన పదార్థాలు:

బచ్చలి కూర: 1కట్ట
గోధుమ పిండి : 2cups
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : డీప్ ఫ్రైకి సరిపడా
నీళ్ళు : రెండు కప్పులు
అల్లం: 1 చెంచా
కారం: 1 చెంచా

తయారు చేయు విధానం:

1. ముందుగా ఆకుకూరను శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్ళు పోసి 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

2. ఐదు నిముషాల తర్వాత నీరు వంపేసి, కూర చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మొత్తని పేస్ట్ లా చేసుకోవాలి.

3. ఇక వెడల్పాటి బౌల్ తీసుకొని గోధుమపిండి, అల్లం, కారం సీడ్స్, ఉప్పు, కారం, మరియు పేస్ట్ చేసుకొన్న ఆకుకూర వేసి బాగా మొత్తగా అన్ని కలుపుకోవాలి.

4. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా పిండిని కలిపి పెట్టుకోవాలి, తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు ఆయిల్ ను డీప్ ఫ్రైయింగ్ పాన్ లో వేసి బాగా కాగనివ్వాలి.

6. నూనె కాగిన తర్వాత కచోరి బాల్ ను ఒక్కొక్కదాన్ని అరచేతిలో పెట్టుకొని కచోరిలా(లేదా వడలా)వత్తుకొని కాగే నూనెలో వేసి రెండు మూడు నిముషాలు డీప్ ఫ్రై చేసుకోవాలి.

7. కచోరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ అన్ని కచోరిలను వేగించుకోవాలి.

అంతే ఆకుకూర కచోరి రెడీ. మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]