Subscribe

Advertisement

image-add

పెళ్లి లారీ బోల్తా, నలుగురు మృతి!

April 30th, 2015 by
lorry accident

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొత్తపల్లి వద్ద పెళ్లి బృందంతో ఒక లారీ వెళుతూ ఉన్నది. ఆ సమయంలో అకస్మాత్తుగా లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.

దీంతో లారీ కింద పడి శరీరాలు నుజ్జునుజ్జై నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడగా, వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసుల అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]