Subscribe

Advertisement

image-add

భర్త అత్యాచారం చేస్తే నేరం కాదని కేంద్రం స్పష్టం..!

April 30th, 2015 by
marital rape is not a crime

వివాహ సాంప్రదాయ కట్టుబాట్లను పాటించే భారత దేశంలో తాళికట్టి పెళ్లి చేసుకున్న భర్త, తన భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా అనుభవిస్తే అది నేరం కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. వైవాహిక సంబంధంలో ఉన్న ఇద్దరి మధ్య జరిగే బలవంతపు కలయికను అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

భర్త బలవంతంగా అనుభవిస్తే, అది అత్యాచారం (రేప్) కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్‌‌లో ఉందని గుర్తు చేస్తూ, దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? అని డీఎంకే సభ్యురాలు కనిమోళి వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు సమాధానమిచ్చారు.

భార్యకు ఇష్టం లేకుండా బలవంతపెడితే, అది విదేశాల్లో నేరమని, భారత్‌‌లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్‌‌గా నిర్వచించలేమని, చట్ట సవరణ ఆలోచనేమీ తాము చేయడం లేదని హరిభాయ్ వెల్లడించారు. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే, ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, ఇండియాలో కుటుంబ విలువలకు ఇది విఘాతమని వెల్లడించారు.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]