Subscribe

Advertisement

image-add

క్యాప్సికమ్ దోసె తయారీ విధానం!

February 5th, 2015 by
capsicum dosa

క్యాప్సికమ్‌తో వెరైటీ వంటకాలు తయారు చేసుకోవచ్చు. పిజ్జాల్లో ఉపయోగించే క్యాప్సికమ్‌ను మీరు ఇంట్లో తయారు చేసే దోసెల్లో ట్రై చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు.

కావలసిన పదార్థాలు :

క్యాప్సికమ్ ముక్కలు : అరకప్పు
మొక్కజొన్నపిండి : పావుకప్పు.
మిరియాల పొడి : అరస్పూను.
ఉప్పు : తగినంత.
వెన్న : అరకప్పు.
కోడిగుడ్లు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) : రెండు.
ఉల్లిపాయలు ముక్కలు : అరకప్పు

తయారీ విధానం:

ముందుగా క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత వెన్నను పెనంపై వేసి కరిగించి, మిక్సీలో రుబ్బిన మిశ్రమంతో అట్టులా వేసుకోవాలి.

ఈ అట్టుల్ని సన్నని సెగపై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండువైపులా కాల్చాలి. తర్వాత చిల్లీ సాస్, టమోటా సాస్ లేదా గ్రీన్ చట్నీ వంటి సైడిష్‌తో వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు.

Share Button

Related Topics: , , , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]