Subscribe

Advertisement

image-add

పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం!

April 30th, 2015 by
fire accident in china

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న ఒక కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ సుభాష్‌నగర్, గంపలబస్తీలో లోకేష్ సాల్వెంట్స్ గోదాంలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

గోదాం ప్రక్కనున్న మరో మూడు పరిశ్రమలకు మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలతో నల్లటి పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదంటే కెమికల్ రసాయనాలను తరలించలే క్రమంలో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. రసాయన డ్రమ్ములు పేలడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం సంభవించలేదు.

Share Button

Related Topics: , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]