Subscribe

Advertisement

image-add

ఏయ్…నేనే….నీ ఒంటరిని…..||పద్మా శ్రీరామ్||

December 15th, 2014 by
feeling-alone

ఏయ్…నేనే….నీ ఒంటరిని…..||పద్మా శ్రీరామ్||

మెత్తని పచ్చిక తిన్నెలు..
చుట్టూ పచ్చని గిరికన్నెలు
సంధ్యా సమీరాలు మోసుకొస్తూ..
ప్రకృతి పరిణయ వన్నెలు…
వీటన్నిటి మధ్య నీ కన్నుల కొలనుల్లో
ఈదులాడే నన్ను చదువుకోవాలని
ఆరాటంగా నీకేసే చూస్తూ నేను..

నా చేయి పట్టుకుని ఏకదీక్షతో
పదే పదే నా గాజులు లెక్కపెడుతూ
అలౌకిక తాదాత్మ్యంలో నాకందని నీ చూపు

హ్మ్….నీ సన్నిధిలో సైతం …..నే ఒంటరినే
చుట్టు ముట్టిన చీకటి తెరలు…మధ్యలో ఏదో మెలకువ
కిటికీలోంచి నవ్వుతున్న పలుచని వెన్నెల ధారలు
పక్కనే ఆదమరచి నిదురపోతున్న నువ్వు…

మౌనంగా వెన్నెల చెప్పిన ఊసులు విన్నాక
అవన్నీ నీకు చెప్పాలనిపిస్తుంది…కానీ నువ్ నిద్రలో…

నిను మేల్కొలపాలని తాకిన నా చేతిని .ఊఁ…అంటూ
ఏమీ మారాడకుండానే ..రెండు చేతులతో పట్టుకుని
పదిలంగా గుండెపై పెట్టుకుని అలాగే నిద్రపోతావ్…
ప్చ్….నీతో ఏకాంతంలో సైతం …..మళ్ళీ నే ఒంటరినే…

చుట్టూ రంగు రంగుల పూల వనం
నిన్నూ నన్నూ కెమేరాలో బంధిస్తూ మిత్రగణం
అదేంటో ప్రపంచమంతా మాయమై…
నువ్వొక్కడివే నా కనుపాపల్లో…

అయినా నీకర్ధం కాదు…
అటు జరుగు…ఇటు తిరుగు
అంటూ నా రూపాన్ని కెమెరాలో
బందీ చేయాలని చూస్తూంటావు

ఎంతో ప్రపంచాన్ని చూసావు
మరి నా మది తీరాన్ని ఎప్పుడు చూస్తావో…
అప్పటివరకూ నీ సగభాగాన్నైనా…
నీలో ఉన్నా…నీతో ఉన్నా…నీ నేను….
వెలితినవ్వుల వెనుక దాగుతూ…ఒంటరినే….

పద్మా శ్రీరామ్ || 29 Nov 2014 ||

Share Button

Related Topics: , ,

This post currently has one comment.
By K KIRSHNAVENE
on January 2nd, 2016 at %I:%M %p

PADMA SRIRAM YOUR POETRY HERT TACHING. HOPE YOU DO WELL IN POETRYS

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]