Subscribe

Advertisement

image-add

ఏది నిజం? ||రవి కటకం||

December 18th, 2014 by
ravi

ఈ సమాజం ఎలా ఉద్బవిoచిందో ఇప్పటికి ,ఎప్పటికి అంతు చిక్కని ప్రశ్న. ఐనా కానీ ఇ సమాజంలో ఎన్నో మార్పులు, ఎన్నో వింత , వింత పోకడలు సంబవించాయి ,సంబవిస్తూనే వున్నాయి .చాలా మార్పూల్లొ ఎన్నో వాటికీ సమాధానాలు కనుగొన్నారు. కాని ఒక్క దేవుడి విషయం లో మాత్రమే ఇప్పటికి రొండు బిన్న అభిప్రియాలు కలిగి వున్నవారు ఉన్నారు . దేవుడు వున్నాడు అని నమ్మే వారు ఎన్నో గ్రంధాలను , పురాణాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు దేవుడు వున్నాడు అని నిరూపించటానికి, దేవుడు లేడు అని నమ్మే వారు ఎన్నో శాస్త్ర ,సాంకేతికమైన ఉదాహరణలుగా చూపిస్తున్నారు దేవుడు లేడు అని నిరూపించటానికి . ఎవరు ఎన్ని చెప్పినా, చూపించినా కొన్ని సంఘటనలు చూస్తే దేవుడు వున్నాడు/లేడు అనిపిస్తుంది. కొంతమంది దేవుడు రూపంలో చలామణి అవుతున్న ఏదో కొన్ని అధ్బుతాలు చేసి ప్రజలకి దేవుడు వున్నాడు అని నిరూపిస్తున్నారు. అదే అధ్బుతాలాను శాస్త్రీయంగా, సాoకేతికంగా సాధ్యమైనదిగా నిరూపిస్తున్నారు ఇంకోతమంది . చాలా మంది ఎవరిని నమ్మాలో నమ్మ కూడదో, ఏది నిజమో కాదో అటు ఇటు అర్థం కానీ పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇతర దేశాలలో దేవుడిని ఏ విధంగా చూస్తారో తెలియదు గాని , మన బారత దేశంలో మాత్రం దేవుడు పట్ల వల్లమాలిన ప్రేమ. కంటికి కనిపించని , ఉన్నాడో లేని దేవుడిని ప్రేమిస్తారు,గౌరవిస్తారు,క్షమిస్తారు . కానీ కని పెంచిన తల్లితండ్రులను, విద్యను నెర్పించన గురువులను,పిల్లను ఇచ్చిన అత్తమామలును కష్ట కాలంలో కనీసం పది శాతం కుడా చూపించరు. ఇలా మాట్లాడాలి అంటే ఎన్నో,ఎన్నోన్నో ఉదాహరణలు చూడోచ్చు.

ఇలా అర్థం పర్థం లేని విధానాలతో, ప్రతి దానికి అవసరం వున్నా లేకున్న దేవుడు అని ముసుగులో జీవితంలో అభివృద్ధిని, చూట్టు పక్కల జనాల ప్రేమని కోల్పోతున్నారు. మనo ఇప్పుడు దేవుడు వున్నడా/లేడా అని మాట్లాడటం లెధు. దైవత్వం అనీ ముసుగులో ప్రజలని కొన్ని శక్తులు ఎలాగా వేర్రి వేషాలు వెయిస్తున్నరొ ఇ కథ ద్వారా చూద్దాం. తుమ్మినా,దగ్గినా , తినాలి అన్న, కాలు బయటకి పెట్టాలి అన్నా , అది చెయ్యాలి అన్నా , ఇది చెయ్యాలి అన్నా అన్నిoటికీ ఒకటే మందు. అలాంటి సమాజంలో ఇద్దరి స్నేహితుల కథ. ఈ కథ ద్వారా నిజంగా దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోకుండా సమాజం ప్రవర్తన ఎలా వుందో చెప్పే చిన్న ప్రయత్నం.
ఈ కథ మనకి స్వాతంత్రం వొచ్చిన 20 సoవత్సరాలు తరువాత అంటే 1967 లో ఒక గ్రామంలో మొదలు అవుతుంది . ఎవరి మనో భావాలూ దెబ్బ తినకూడదు అని ఇక్కడ గ్రామాల పేర్లు , మతాల పేర్లు , కులాల పేర్లు వివరించకుండా కథని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాము .ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామం లో ఇద్దరు స్నేహితులు వుంటారు . వారిద్దరు చాల మంచి మిత్రులు. ఒకరు ఏమో చాల మంచి చిత్రకారుడు మరియు శిల్పకారుడు . చిత్రకారుడికి దైవ భక్తి అన్న, దేవుడు అన్న అంత నమ్మకం ఉండదు అలా అని దేవుడు లేడు అని వాదించడు, ఒకరు ఏమో ఏదో చిన్నఉద్యోగస్తుడు, యీతనికి దైవ భక్తి అన్న, దేవుడు అన్న చాల నమ్మకం, ఇష్టం, ప్రేమ. చిత్రకారుడు చాల విభిన్నమైన చిత్రాలను,శిల్పాలను చిత్రీకరిస్తూ చాలా విజయాలు ,బహుమతులు మరియు కీర్తిని సంపాదిస్తూ వుంటాడు . ఇద్దరు ఎంత మంచి మిత్రులు ఐనా వారిద్దరికీ దేవుడు పట్ల వున్నా బిన్నమైన అభిప్రాయాల వలన ఎప్పుడు ఇద్దరి మధ్య వాగ్గ్వివివాదం తరుచుగా జరుగుతూ వుంటుంది కాని ఎప్పుడు స్నేహాన్ని , స్నేహితులుని అగౌరవపరుచుకో లేదు. కాలానుగుణంగా చిత్రకారుడు ఊహించనంత ఎత్తుకు ఎదుగుతాడు . 1975లో ఒక రోజు కూర్చొని పిచ్చపాటి చేస్తుండగా చిత్రకారుడుతో మిత్రుడు అంటాడు నీ కీర్తి, విజయం , డబ్బు అన్ని భగవంతుడు దయవలన వోచ్చిన్దిరా ఇప్పటికైనా కొంచెం దేవుడి మీద నమ్మకం పెంచుకోరా, నువ్వు చాల అదృష్టవంతుడివి నీకు దేవుడి మీద నమ్మక లెకపోయిన దేవుడికి నీ మీద ఎంతో ప్రేమరా . లేకపోతే నువ్వు అడక్కుoడానే అన్ని ఇచ్చేస్తున్నాడు అని అనేసాడు . ఎప్పడు సౌమ్యంగా మాట్లాడుకునే స్నేహితులు ఇసారి కొంచెం గట్టిగానే వాదించుకున్నారు. ఆ వాదులాటలో చిత్రకారుడు స్నేహితుడితో అంటాడు మన స్నేహం మీద వున్న గౌరవంతో నేను నీ నమ్మకాన్నిఎప్పుడు వేలు ఎత్తి చుపించలేదు , ఎందుకు అంటే భగవoతుడు ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు . నేను కుడా అందులో నిమిత్త మాత్రుడిని. ఎవరి నమ్మకాలతో వాళ్ళు జీవిస్తున్నారు. నేను కుడా అదే నమ్మకంతో నా కష్టాన్ని, నా ప్రతిభని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఈ విజయాలను సాధించాను, దానితో పాటు కాలo కూడా కలిసి వొచ్చిoది. మీ లాంటి వాళ్ళు అందరు కాలం కలిసి రావటం అoటె కుడా దేవుడు మహిమ అంటారు. నాకు నవ్వు, జాలి,కోపం వొస్తుందిరా చాల మంది జీవితాలను, జీవన గమ్యాలను చూస్తుంటే. అర్థం పర్థం లేని విధానాలతో, ప్రతి దానికి అవసరం వున్నా లేకున్నా దేవుడు అని ముసుగులో జీవితంలో అభివృద్ధిని, చూట్టు పక్కల జనాల ప్రేమని కోల్పోతున్నారు. దేవుడు అని ఏది చెప్పిన గుడ్డిగా నమ్మేస్తున్నారు జనాలు. అది నిజమా లేక అబద్దమా అనే ఆలోచనికి అసలు తావు ఇవ్వటం లెదు. ఇంకా ముందుముందు రోజుల్లో ఎన్ని వింతలు , విచిత్రాలు చూడాల్సి వొస్తుంది ఏమో అని చాల భయంగా వుందిరా. సరేరా ఇవ్వి అన్ని ఎందుకురా మనం ఇప్పుడు 30 వయస్సులో వున్నాము , ఇంకా ఎంత కాలం బతుకుతమో మనకు తెలియధు. నాకు వున్న ప్రతిభతో ఒక విగ్రహన్ని తయారు చెస్తాను. ఆ విగ్రహం ఎలా వుంటుంది అంటె ఇప్పటివరకు ప్రజలు కొలిచె ఏ దేవుడు రూపంలో ఉండదు, ఒక కొత్త రూపంలో విగ్రహాన్ని తయారు చేసి మనం ఆ విగ్రహాన్ని ఏదో ఒక మారుమూల ప్రదేశంలో ఎవరి కంటికి కనిపించకుండా పూడ్చి వోచ్చేద్దాము. ఆ విగ్రహం ఏ దేవుడికి సంబందించింది కాదు అని నీకు , నాకు మాత్రమె తెలుసు. ఎప్పుడైతే ఆ ప్రదేశం అభివృద్ధిచెంది విగ్రహం బయట పడుతుందో అప్పుడు ప్రజల మరియు దేవుడి మనుషులమని చెలామణి అవుతున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాము లేకపోతే చూపిద్దాము. అంతా మంచిగా వుoటె ఇద్దరము కలిసి చూద్దాము ఆ భ్రమని, లేకపోతె ఎవరు బ్రతికి వుంటే వాళ్లు చూస్తాము . ఎవరు బ్రతికి లేకపోతె ఇ కథ చదివే ప్రేక్షకులు చుస్తారు. ఇద్దరు సరే అనుకోని, ప్రతిభని వినియోగించుకొని ఒక విగ్రహన్ని తయారు చేసాడు . ఒక రోజు ఇద్దరు బయలుదేరి ఎక్కడో ఒక ప్రదేశంలో పూడ్చి వొచ్చారు. వారిద్దరికీ వున్న స్నేహంబంధం వలన ఎవరికీ ఈ విషయాన్ని చెప్పకూడదు అని నిర్ణయించుకున్నారు.

కాల చక్రం గిర్రునా తిరిగి తిరిగి మనం ఇప్పుడు 2005 సoవత్సరంలోకి అంటే విగ్రహం పూడిచ్చిన సుమారు 30 సంవత్సరాలు తరువాత ప్రపంచంలోకి ప్రవేశించాము. కంప్యూటర్ యుగం వలన అందరవి ఊరుకులు పరుగుల జీవితం. ఆ పరుగుల జీవితాన్ని ప్రారంభిoచటానికి అప్పుడే డిగ్రీలు పూర్తి చేసిన కాళీ మరియు శిల్పా తయారు అయ్యారు . అన్నట్లు చెప్పటం మర్చిపోయానoడో ఇక్కడ కూడా శిల్పాకి మన చిత్రకారుడికి పోలికలు వున్నాయి దేవుడు విషయంలో అంతేకాకుండా మన కాళీ గారికి మన ఉద్యోగస్తుడికి పోలికలు వున్నాయి దేవుడు విషయంలో. ఇద్దరు ఒకే రోజు చాల పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వొచ్చారు . అంతా మంచి జరిగి ఇద్దరికీ ఉద్యోగాలు వొచ్చాయి . ఒకరికిఒకరు పరిచయాలు ఐన తరువాత కాంటీన్లో కూర్చొని అవ్వి,ఇవ్వి మాట్లాడుకొని చివరికి దేవుడి విషయానికి వొచ్చోరు . కాళీ దేవుడి దయ వలన , మా అమ్మ,నానల పూజల వలన నాకు ఉద్యోగం వొచ్చింది అని అంటాడు, వెంటనే శిల్ప దేవుడు ఉన్నాడో లెదో తెలియదు గాని ఇ ఉద్యోగం రావటానికి ముఖ్యకారణం నా కృషి , పట్టుదల అంటుంది. మొదటి పరిచియమే కనుక ఇంకా లోతుగా వాదిoచుకోకుండా ఒకరి అభిప్రియాలను ఒకరు గౌరవించుకున్నారు. వాళ్ళు అలా మాట్లాడటానికి కారణం వారు పెరిగిన వాతావరణం, వారి తల్లిదండ్రుల పెంపకం. రోజులు గడుస్తున్న కొద్ది కొన్ని రోజుల్లో ఇద్దరు స్నేహితులుగా అయ్యారు. ఎ మాటకి, ఆ మాట చెప్పుకోవాలి కొన్ని విషయాలలో అభిప్రాయ బేదాలు తప్ప ఇద్దరివి చాల వరకు అభిప్రాయాలూ కలుస్తాయి . ఇంకా కొన్ని రోజులు తరువాత ఆ స్నేహం పెళ్లిబంధానికి దారి తీసింది 2009లో . వీరి బంధం అంచలెoచలుగా పెరిగానట్లుగానే వారు వున్న ఊరు కుడా విజన్-2020,కంప్యూటర్ రంగం, ఔటర్ రింగ్ రోడ్, ప్రభుత్వాల పుణ్యమా అని దినదినాభివృద్ది చెంది ఎవరు ఊహించనంత ఎత్తుకు అభివృద్ధి చెందింది. అభివృద్ధితో పాటు భూముల ధరలు కుడా విపరీతంగా పెరిగాయి. ఇ అభివృద్ధి,ధరలు పెరుగుదల చూసి, ఎలాగో వారిద్దరు వివహం చేసుకుందాము అనుకున్నారు గనుక వివాహం ముందే గృహాన్ని ఏర్పరుచుకుంటే మంచిది అని ఇద్దరు ఒక నిర్ణయానికి వొచ్చారు. అనుకుందే తడువుగా వారికున్న బడ్జెట్లో స్థలం వెతుకులాట ప్రారంభించారు . ఇ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని కొనే వాళ్ళు , అమ్మే వాళ్ళు కన్నా దళారీలు ఎక్కువ అయ్యారు. ఇ దళారి వ్యవస్థ వలన భూముల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి . అలా వెతికి,వెతికి ఆఫీసుకి 15కిలోమీటర్ దూరంలో ఒక స్థలం కొనుగోలు చేసారు. ఎలాగో స్థలం కొన్నారు అని వారిఇరివురి పెద్దలు వారి వివాహం చేసారు. వివాహం జరిగిన కొద్దిరోజుల్లో అన్ని కార్యక్రమాలు పూర్తేన తరువాత ఇద్దరు గృహం నిర్మించటానికి నిర్ణయిoచుకున్నారు. కాళికి ఏమో ఒక మంచి రోజు చూసుకొని శంకుస్థాపన చెయ్యాలి అని, శిల్పకి ఏమో సెలవు రోజున వీలు చూసుకొని శంకుస్థాపన చెయ్యాలి అని ఆలోచన. ఇష్టంలేకున్నా కాళీ కోసం ఒక స్వామి దెగ్గరికి వెళ్లి మంచి రోజుని కనుక్కున్నారు . అదృష్టం బాగుండి స్వామి చెప్పిన తేది కాళీకి నచ్చినట్లు, శిల్పాకి నచ్చినట్లు శంకుస్థాపాన రోజు సెలవు రోజున వొచ్చింది . చెప్పటం మర్చిపోయనండో మంచి రోజు చెప్పినందుకు 1000Rs తీసుకున్నారు స్వామిజిగారు .శంకుస్థాపన రోజున వారి బంధువులని , స్నేహితులిని పిలుచుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు . కార్యక్రమానికి విచ్చేసిన పూజారి కొన్ని మంత్రాలు చదివన తరువాత పునాదులు కట్టటానికి గుంటలు త్రవ్వుటకు అనుమతి ఇచ్చారు. అందరికి డబ్బులు అందినవి అనుకుంటా అన్ని పనులు చకాచకా జరుగుతున్నాయి. అందులో భాగంగా మేస్త్రి కుడా గుంటలు త్రవ్వటం చకాచకా ప్రారంభించాడు. అలా త్రవ్వుతుండగా పది అడుగుల లోతు త్రవ్వగానే ఎవరు ఊహించనిరీతిలో 1975లో పూడ్చిన విగ్రహం బయట పడుతుంది. అందరు ఆశ్చరంగ్యా చూస్తారు. దేవుడు అంటే నమ్మకం వున్నవాళ్ళు వారికీ ఇష్టమైన దేవుడితో పోల్చుకొని మనసులో,బయటకి ప్రార్ధనలు చేయనారంభించారు . దేవుడు అంటె నమ్మకం లేనివాళ్లు ,శిల్పా లాంటివాళ్ళు నిదానంగా చూస్తూ ఏదో మనసులో తర్జనభర్జనలు పడుతున్నారు. ఇ విషయం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి తెలిసి , ఇప్పుడున్న మీడియా వలన రాష్ట్రము మరియు దేశమంతా గాలికన్నా వేగంగా ప్రవహించి అందరి చెవిలో పడింది. అందరి చెవిలో అంటె దేవుడి మనుషులమని చెలామణి అవుతున్నవాళ్ళు, మoత్రులు , పుజారిలు , దేవుడిని నమ్మేవాళ్ళు, నమ్మనోళ్ళు మరి ముఖ్యంగా మన చిత్రకారుడికి, ఉద్యోగస్తుడికి చేరుతుంది . మన చిత్రకారుడికి,ఉద్యోగస్తుడికి ఎలాగో అసలు నిజం తెలుసు కనుక టీవీ ముందు కూర్చొని ప్రతి పది నిమిషాలకి ఛానల్స్ మారుస్తూ విగ్రహం యొక్క గొప్పతనాన్ని,ఘనతను ప్రజలు, స్వామిజిలు, దేవుడి మనుషులమని చెలామణి అవుతున్న వాళ్ళు , న్యూస్ చానల్స్ వాళ్ళు ఎలా చెపుతున్నారో విక్షిoచసాగారు మరియు పానకంలో బుడగలాగ ఇ కథ చదివే ప్రేక్షకులు కుడా విక్షిoచసాగారు. విగ్రహస్థలం దగ్గర చానల్స్ వాళ్ళు , స్వామిజిలు , ఎందరో వొచ్చి విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు . ఇంకో ప్రక్కన వార్తా చానల్స్ వాళ్ళు , ఒక్కో చానల్ వాళ్ళు ఒక్కో స్వామిజిలతో, దేవుడి మనుషులమని చెలామణి అవుతున్న వాళ్ళతో ఓపెన్ హార్ట్, న్యూస్ వాచ్,ఎన్కౌంటర్, ఇంకా ఏదోకటి నడిపిస్తూనే వున్నారు . స్థలం దెగ్గర అంత మంది చేరటం వలన మన కాళీ,శిల్పాకి కుడా టీవీ ముందు కూర్చొని ప్రతి పది నిమిషాలకి ఛానల్స్ మారుస్తూ విగ్రహం యొక్క గొప్పతనాన్ని,ఘనతను విక్షిoచసాగారు. ఒక స్వామిజి అంటాడు ఇది సాక్షాత్ చాల మంది కొలిచే దేవుడి రూపంలో వున్న విగ్రహo, ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి గుడి కట్టాలి. స్వామిజి ఇలా అన్నాడో లేదో ప్రతి చోట ప్రజలు, సంస్థలు ధనసేకరణ ప్రారంభించారు . సేకరించిన ధనం ఎంతవరకు ఉపయోగిస్తారో లేదో తెలియదు. విగ్రహం నిజంగా దేవుడికి సంబందించిందా , ఎందుకు వొచ్చింది అక్కడ అనే ఆలోచన ఎవరికీ లెధు. అందరికి ఒకటే ఆలోచన ఎంతో కొంత దానం చేస్తే లక్షలు,కోట్లు వొస్తాయి, అనుకున్నది జరుగుతుంది, ఎవరికి తోచిన రీతిలో వారి అవసరాలకి తగినవిధంగా ఆలోచన. ఇంకో స్వామిజి అంటాడు విగ్రహం దొరకటం వలన ఇంటి యజమానికి ప్రాణగండం, ప్రాణగండం పోవాలి అంటే ఇంటి శ్రీమతి ప్రాణహర్పణ చెయ్యాలి అంటాడు. ఇది విన్న చిత్రకారుడు,ఉద్యోగస్తుడు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని శిల్ప,కాళీకి సంబంధం లేకుండా విగ్రహం వొస్తే వాళ్లలో లో ఒకళ్ళు ఎందుకు మరణిస్తారో అని మనసులో అనుకోని బాధ పడతారు. ఈ స్వామిజి వాదనలో అంత పస లేకపోవటం వలన, స్వామిజి అంత పేరుగలవాడు కాకపోవటం వలన ఆ విషయానికి అంత విలువ ఇవ్వలేదు. విగ్రహం వార్త విన్న కొంతమంది అప్పుడెప్పుడో వినాయకుడు పాలు త్రాగాడు అని విగ్రహానికి పాలు పట్టటానికి వొస్తారు. వొచ్చిన వాళ్ళలో చాలా మంది ఇంట్లో పిల్లలికి, వయసు మీద పడి కాలం వెల్లదిస్తున్న పెద్దవాళ్ళకి పాలు పట్టరు. ఇది చూసిన చిత్రకారుడు, ఉద్యోగస్తుడు ఇంకోసారి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని మనసులో నవ్వుకుంటారు. చిన్నగా అప్పుడే ఉద్యోగస్తుడి మోహంలో, మనసులొ కొంచెం చిత్రకారుడు చెప్పిన ఘోష/బాష అర్థం అవుతుంది. ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో అని మనసులో మధన పడతాడు . తెల్లారే సరికి రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్దపెద్ద బోర్డులతో విగ్రహ స్థలం దెగ్గర అంతర్జాతీయ విమానాశ్రం , అంతర్జాతీయ కంపెనీలు వెలుస్తాయి త్వరపడండి చాలా తక్కువ ధరకి స్థలం దొరుకుతుంది అని ప్రచారం ప్రారంభిoచారు . చాలా తక్కువ ధర అంటె కేవలం మన శిల్ప,కాళీ కొన్న దానికంటే రెండింతలు ఎక్కువ. ఆ ధర విన్న శిల్ప,కాళీ వాళ్ళు కొన్న కొన్ని రోజులికే ధర రెట్టింపు అయినందుకు సంతోషించాలో లేక వారు ఇ స్థలం కొనటానికి ఎంత కష్టపడ్దరో దానికి రోoడిoతలు తోటి వాళ్ళు కష్టపడాలి అని జాలి పడాలో అర్థం కాలేదు . ఇ వింతలు జరుగుతుండగానే పురావస్తుశాఖ వారు వాళ్ళకి తోచిన రీతిలో విశ్లేషణ చేసి అటుఇటు కొంచెం అసలు నిజానికి దెగ్గరగా సమాచారం ఇచ్చె ప్రయత్నం చేసారు.ఇ విగ్రహం 30-40 సవంత్సరాలు మించి పాతది కాదు అని చెప్పగలిగారు. ఇది ఇక్కడికి ఎలావొచ్చిందో మాత్రం చెప్పలేక పోయారు,అలాగే విగ్రహం ఎ యుగానికి సంబంధించిందో కుడా చెప్పలేకపోయారు.
ఒకవేళ పురావస్తుశాఖ వారు ధైర్యం చేసి ఏమైనా చెప్పాలి అన్న ప్రజల మనో భావాలకి ఎక్కడో ఆటంకం కలుగుతుందో అని భావించి ఏమి మాట్లాడకుండా వుండిపోయారు . అలా చెప్పకుండా ఉండటానికి కారణం వాళ్ళకి తెలుసు, ఈ మధ్య ఏదో సినిమాలో చెప్పినట్లు లాజిక్ని ఎవరు నమ్మరు,అందరు మాజికులే నమ్ముతారు. అందుకే మన దేశంలో శాస్త్రజ్ఞులు కన్న స్వామిజిలకి గౌరవం , అభిమానులు , కీర్తి , సంపాదన ఎక్కువ. ఇంకొంతమంది వారికిష్టమైన దేవుడికి అపాదించుకొని ఎవరికీ తోచిన రీతిలో వారు 11 రోజులు, 21 రోజులు, 41 రోజుల దీక్ష చెసెస్తున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కనీసం ఈ దీక్షల పేరుతోనైన మంచి మనిషులుగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దీక్షల చాలా మటుకు ఎంతో కొంత మేలు చేస్తుంది సుమీ. ఇవిధంగా ఎన్నో వింతలు, విచిత్రాలు జరిగినాయి . అవ్వి అన్ని ఇక్కడ చెప్పాలి అంటే చాల కష్టం అంతే కాకుండా ఇష్టం లెదుకుడా. ఇలా జరిగిన కొన్ని రోజుల్లో కాళి,శిల్పాకి వారి స్థలం వాళ్ళకి వొచ్చి గృహం కట్టుకొని వారి సంసారిన్ని ప్రారంభించటానికి సిద్దమవుతారు . ఆ విగ్రహం ఏమియింది , ఎలావుంది అవ్వి అన్ని ఇంకా చెప్పల్సిన అవసరం లెధు. ఎందుకంటె చిత్రకారుడి కన్న, కథ చదివే ప్రేక్షకులికే అర్థం అయ్యివుంటుంది చిత్రకారుడు ఏమి చెప్పద లుచుకున్నాడో.

కాళి,శిల్ప కథ చూసాక చిత్రకారుడు,ఉద్యోగస్తుడు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని ఉద్యోగస్తుడు చిత్రకారుడితో అంటాడు ఇవ్వి అన్ని చూస్తుంటే నువ్వు చెప్పేది నిజం అనిపిస్తుంది రా. ఐతే భగవంతుడు లేడు అంటావా . దేవుడు ఉన్నాడో ,లేదో ఎవరికీ తెలియదురా. నిజం చెప్పాలి అంటే నాకు కుడా అర్హత లేదురా ఎందుకుంటే నేను కుడా దేవుడు లేడు అని నిరుపించలేను, అలాగని దేవుడు వున్నాడు , నమ్ముకుంటే చాలు అంతా మంచి జరగుతుంది అంటే నేను అసలకి ఒప్పుకోను . మన పాత తరం వాళ్ళు ఎలాగో మనల్ని ఆ మాయమత్తులోనే పెంచారు. కనీసం మన తరం అన్న కొంచెం నిజానికి,భ్రమకి కొంచెం తేడా చెప్పటానికి ప్రయత్నించాలి కదరా. ఐనా కాళి ,శిల్పా కధ చూసాక,చదివాక నీకు, ప్రేక్షకులికి ఏది నిజమో,భ్రమో చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇ కథ చదివాకా ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు ఊహించుకొని దొరికిన విగ్రహానికి ఏదో ఒక ముగింపు ఇస్తారులే.

గమనిక :ఈ కథలో ఏమైన తప్పులు కాని ఎవరినైనా బాధించి వుంటే క్షమించమని కోరుకుంటున్నాం. అందరికి మంచి జరగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.

ఇట్లు,
మీ రవి కటకం.

Share Button

Related Topics: , ,

This post currently has 2 comments..

nice article. Thank you

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]