Subscribe

Advertisement

image-add

తలలో బుల్లెట్ తో 95 ఏళ్లు!

April 30th, 2015 by
bullet in head

ఎప్పట్లాగే ఆ రోజు కూడా విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుందాం అన్నాడు విలియం అన్న. దానికి ఓకే చెప్పాడు విలియం. అంతే క్షణాల్లో ‘‘ .22 రైఫిల్’’తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు. దాన్ని అటూ ఇటూ తిప్పుతూ సినిమా హీరోలా పోజు కొట్టాడు. రైఫిల్‌ను పట్టుకుని రకరకాల భంగిమలు ప్రయత్నించాడు.

దురదృష్టవశాత్తూ ఆ రైఫిల్ పెద్ద శబ్దం చేస్తూ పేలింది. గట్టిగా చెవులు మూసుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అయితే కొద్దిసేపటికి విలియం చెవి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది.

బుల్లెట్‌ని తొలగిస్తే విలియం ప్రాణాలతో ఉంటాడనే నమ్మకం తమకు లేదని చేతులెత్తేశారు. చేసేదేం లేక బుల్లెట్‌ని తలలోనే ఉంచుకుని కాలం వెళ్లదీశాడు విలియం లాలిస్ పేస్. అయితే దీని ప్రభావం నెమ్మది నెమ్మదిగా అతని దృష్టి, వినికిడి శక్తిపై పడింది. కుడి కన్ను, చెవి పనిచేయడం మానేశాయి. అలా 95 ఏళ్లపాటు బతికిన విలియం 2012లో 103 ఏళ్లకు కాలం చేశాడు.

Share Button

Related Topics: , , , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]