Subscribe

Advertisement

image-add

శివరాత్రి స్పెషల్–యాపిల్-డ్రై ఫ్రూట్ సలాడ్!

February 17th, 2015 by
FruitSalad2

ఉపవాసం ఉండే వారికి ఈ ఫ్రూట్స్ మరియు డ్రై ఫ్రూట్ సలాడ్ తగినంత శక్తిని అంధిస్తుంది. ఉపవాసం ఉండటానికి అవసరం అయ్యే పోషకాలను శరీరంలో కోల్పోకుండా ఫుల్ ఫిల్ చేస్తుంది. పండ్లు మాత్రమే కాకుండా అందులో కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం…

కావలసిన పదార్థాలు:

యాపిల్ ముక్కలు – 2cups

పుచ్చకాయ ముక్కలు – 4

అరటిపండు ముక్కలు – 5

పిస్తా పప్పులు – 6

బాదం: 6

ఎండు ద్రాక్ష: 10

పాలు – 1cup

పంచదార – 1/2cup

తేనె – 1tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా కొన్ని యాపిల్ ముక్కల్ని కావల్సిన సైజ్ లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో సగం మిక్సీ జార్ లో వేసి మొత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

2. ఒక గిన్నెలో యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకోవాలి.

3. పాలు కాచుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

4. వేడి చల్లారాక పాలను పండ్ల ముక్కల్లో పోయాలి. యాపిల్ ముక్కల గుజ్జుని. డ్రైఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

5. అంతే ఆపిల్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ. పది నిమిషాల తర్వాత తింటే కడుపులో చల్లగా బాగుంటుంది. శివరాత్రి ఉపవాసం ఉండే వారికి ఇది చాలా శక్తినిచ్చేటువంటి సలాడ్.

Share Button

Related Topics: , , ,

This post currently has no commets..

Post your comment

Your email address will not be published. Required fields are marked *

[email protected]
Enquires Contact : +91-9030022169, 9494142002   Email: [email protected]